హైదరాబాద్: 28°C
తెలంగాణ

హామీల అమలు చేయాలని BRS నిరసన

JN: పాలకుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం బీఆర్‌ఎస్‌ నాయకులు నిరసన చేపట్టారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి, హామీల అమలుపై వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.