హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ చెస్‌లో సత్తా చాటిన జిల్లా వాసి

SKLM: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన 6వ ఆల్ ఇండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో శ్రీకాకుళం నగరానికి చెందిన క్రీడాకారుడు భేరి చిన్నారావు ప్రతిభ కనబరిచారు. ఈనెల 4వ తేదీ నుంచి మూడు రోజుల పాటు 540 మంది పోటీపడిన ఈ టోర్నీలో 5 విజయాలు సాధించారు. దీంతో సెమీ సీనియర్ కేటగిరీలో 8వ స్థానంలో నిలిచి ట్రోఫీ అందుకున్నారు.