హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చవితిపై పీస్‌ కమిటీతో పోలీసుల సమావేశం

KDP: కమలాపురంలో వినాయక చవితి సందర్భంగా పీస్‌ కమిటీతో పోలీసులు, విద్యుత్‌ అధికారులు సమావేశం నిర్వహించారు. విగ్రహాల ఏర్పాటుకు ముందస్తుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సీఐ మోహన్‌ సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా కరెంట్‌ లైన్లకు దూరంగా విగ్రహాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.