విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రాయవలసలో పంట కాలువలో కోళ్లఫారం వ్యర్థాలు వేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యర్థాలతో కాలువ నీరు కలుషితమై పొలాల్లోకి చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసనతో రహదారిపై వెళ్లే వాహనదారులు, స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పంట కాలువలో కోళ్ల వ్యర్థాలు.. రైతుల ఆవేదన


