PLD: అద్దంకి–నార్కెట్ పల్లి రాష్ట్ర రహదారిపై రొంపిచర్ల సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద అండర్‌పాస్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అండర్‌పాస్ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాల నివారణకు నిర్మాణం చేపట్టాలని కోరారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ లోకేశ్వరరావు ఆందోళనకారులతో చర్చించి ధర్నాను విరమింపజేశారు.
ఆంధ్రప్రదేశ్
అండర్‌పాస్ కోసం సీపీఐ ధర్నా


