హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

అన్నమయ్య: రాయచోటి చిత్తూరు రింగ్‌ రోడ్డు వద్ద గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అన్నమయ్య జిల్లాకు చెందినవారని ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి తెలిపారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి రాయచోటిలో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు.