ప్రకాశం: కంభం మండలంలోని హజరత్ గూడెం రోడ్డు సమీపంలో NH-544D జాతీయ రహదారిపై రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా మంగళవారం ప్రమాదకర మలుపు వద్ద నిదానంగా వెళ్లండి అనే హెచ్చరికను పెయింట్ చేశారు. ప్రమాదకర మలుపు ఉందని వాహనదారులను అప్రమత్తం చేస్తూ, నెమ్మదిగా వాహనాలు నడపాలని సూచించారు. ప్రమాదాల నివారణ, వాహనదారుల భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు సీఐ మల్లికార్జున తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం


