హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోరుమామిళ్లలో పిచ్చికుక్క స్వైర విహారం

KDP: పోరుమామిళ్లలో పిచ్చికుక్క రెండు రోజుల్లో 20 మందిపై దాడి చేసింది. శ్రీరామనగర్, బెస్త వీధి, రంపాడు రోడ్డు, చిదానందనగర్‌ ప్రాంతాల్లో పలువురిని కరిచింది. బాధితులు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందారు. కుక్కల బెడదను అరికట్టేందుకు పంచాయతీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.