హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొయ్యూరు బాలికల పాఠశాలలో అభ్యాస కార్యక్రమం

ASR: కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం బాలికల పాఠశాలలో మంగళవారం సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై పీ.కిషోర్ వర్మ అభ్యాస కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులతో పుస్తకాలు, వార్తాపత్రికలు చదివించి పఠన నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ప్రోత్సహించారు. ప్రతిరోజూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు. చక్కగా చదివిన విద్యార్థినులను అభినందించి బహుమతులు అందజేశారు.