హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయంలో వాయినాలు నోము

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ గవర వీధిలో వెలసిన శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయంలో మంగళవారం వాయినాలు నోము కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 250 మంది మహిళలు భర్తలతో సహా విచ్చేసి ముత్తైదులు వాయినాలను అందుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు పెంటారావు, సత్తిబాబు, నాయుడు తదితరులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.