హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇప్సోస్ పేరుతో నకిలీ తనిఖీలు.. పోలీసుల అదుపులో ముగ్గురు

కోనసీమ: సఖినేటిపల్లి మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్సోస్ సంస్థ పేరుతో తనిఖీలు నిర్వహిస్తూ డబ్బులు డిమాండ్ చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో సిబ్బందిని బెదిరించి నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు అందడంతో పోలీసులు వారి ఐడీ కార్డులను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.