హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు

WGL: వర్ధన్నపేట పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం నేపథ్యంలో సోమవారం మండల అధ్యక్షుడు అడప రాజుతో పాటు పలువురు బీజేపీ శ్రేణులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తున్న నాయకులను అరెస్టు చేయడం సరికాదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.