హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా రాముల వారి నిత్య కళ్యాణం

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిత్య కల్యాణ వేడుక సోమవారం నేత్రపర్వంగా సాగింది. మిథిలా స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన నిత్య కల్యాణ మండపంలో అర్చకులు క్రతువును వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.