BHPL: రేగొండ మండలం గూడెపల్లిలో శనివారం పొలంలో బాంబు పేలి ఓ మహిళా కూలీ తీవ్రంగా గాయపడింది. మిరప తోటలో నలుసు ఏరుతున్న గుండె స్వర్ణలత(34)కు భూమిలో ఏదో తగలడంతో కొడవలితో కదిలించగా పేలుడు సంభవించింది. ముఖం, చేతులకు గాయాలైన ఆమెను పరకాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
బాంబు పేలి మహిళకు తీవ్ర గాయాలు


