హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి'

KMR: సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. సదాశివనగర్ మండలం పద్మాజివాడిలో శనివారం సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి-డ్రగ్స్ నిర్మూలనపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనుమానాస్పద లింకులను తెరవవద్దని, ఓటీపీ, బ్యాంకు వివరాలను ఇతరులకు వెల్లడించవద్దని డీఎస్పీ సూచించారు.