JN: దేవరుప్పుల మండలం నీర్మాలలో సాగునీరు అందక నానా అవస్థలు పడుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు బకెట్లతో నీరు పోస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. నవాబుపేట రిజర్వాయర్ నుంచి నీరు విడుదల కాకపోవడమే ఇందుకు కారణమని వాపోతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే రిజర్వాయర్ నీటిని విడుదల చేసి, ఎండిపోతున్న పంటలను కాపాడాలని రైతాంగం అర్థిస్తోంది.
తెలంగాణ
VIDEO: సాగునీరు అందక అవస్థలు..!


