MDK: జిల్లాలో ఎరువుల కొరత లేదని, 3,340 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఫెర్టిలైజర్ యాప్‌లో సాంకేతిక సమస్యల నివృత్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని, తమ డివిజన్లలోని ఏ మండలంలోనైనా ఎరువులు పొందవచ్చని సూచించారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని కోరారు.
తెలంగాణ
జిల్లాలో ఎరువుల కొరత లేదు: కలెక్టర్


