హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీటు మీది.. ఫీజు నాది: హరీశ్‌రావు

SDPT: విద్యార్థులు కష్టపడి చదివి ప్రభుత్వ వైద్య, ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు సాధించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. సీటు సాధిస్తే ఫీజు చెల్లింపు బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. నంగునూరు మండలం అక్కనపల్లి మోడల్ స్కూల్‌లో నిర్వహించిన ‘మీ భవిష్యత్.. మీ బాధ్యత’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రుల కలను నిజం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.