హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో

ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అల్ నస్ర్ తరఫున మ్యాచ్‌లో గోల్ చేయడం ద్వారా వరుసగా 25 సీజన్లలో గోల్స్ సాధించిన తొలి ఫుట్‌బాలర్‌గా చరిత్ర సృష్టించాడు. 2002-03 నుంచి ప్రతి సీజన్‌లోనూ గోల్స్ చేస్తున్న రొనాల్డో, జ్లాటన్ ఇబ్రహిమోవిచ్ పేరిట ఉన్న వరుసగా 24 సీజన్ల రికార్డును తాజాగా బద్దలు కొట్టాడు.