దక్షిణాఫ్రికా మాజీ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ జొలాని టెటే (38) దారుణ హత్యకు గురయ్యాడు. ఈస్టర్న్ కేప్‌లోని ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో టెటే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన కారులో ఉన్న 27 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రీడలు
మాజీ బాక్సింగ్ ఛాంపియన్ దారుణ హత్య


