హైదరాబాద్: 28°C
క్రీడలు

సౌతాఫ్రికా జట్టుకు భారీ షాక్‌

సౌతాఫ్రికా జట్టుకు బిజీ హోమ్ సీజన్‌కు ముందు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ కగిసో రబాడ తొడ కండరాల గాయం (హ్యామ్‌స్ట్రింగ్) బారిన పడ్డాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో ప్రాక్టీస్ చేస్తుండగా ఆయన కుడి తొడ కండరాలు పట్టేశాయి. ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న రబాడ త్వరలో పూర్తి స్థాయి పరీక్షలు ఎదుర్కొనున్నాడు.