KRNL: క్రీడాకారులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ రాష్ట్ర ఛైర్మన్ కమలాకర్రావు అన్నారు. కర్నూలులో క్రీడాకారులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నామన్నారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయాలని క్రీడాకారులు కోరినట్లు చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బాబురావు, జిలాని భాష, అనంతరత్నం పాల్గొన్నారు.
వార్తలు
క్రీడాకారులకు కాంగ్రెస్ అండ: కమలాకర్రావు


