హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రిసార్ట్స్‌పై ఎక్సైజ్ అధికారుల తనిఖీలు'

ASR: రంపచోడవరం, మారేడుమల్లి మండలాల్లోని రిసార్ట్స్‌, రెసిడెన్సీలపై ఎక్సైజ్ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పార్టీలు, ఈవెంట్ల నిర్వహణకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని యాజమాన్యాలకు సూచిస్తూ నోటీసులు జారీ చేశారు. ప్రమాదకర వాగులు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పర్యాటకులను అప్రమత్తం చేయాలని సూచించారు.