హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వడ్డమానులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

GNTR: తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామంలో శనివారం స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. గ్రామంలో పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి మానవహారం ఏర్పాటు చేసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు.