హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుడిసెలు లేని సమాజమే లక్ష్యం: ఎమ్మెల్యే మేఘారెడ్డి

WNP: ఖిల్లా ఘనపురంలో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి కీలక సూచనలు చేశారు. గుడిసెల్లో జీవిస్తున్న పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. గుడిసెల్లో నివసించే అర్హులైన పేదలకు ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.