హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోప్‌వే పనులను పరిశీలించిన కలెక్టర్‌

ఖమ్మం నగరంలోని ఖిల్లాపై చేపట్టిన రోప్‌వే పనులను కలెక్టర్‌ దివాకర టీఎస్‌ శనివారం పరిశీలించారు. పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఖిల్లాపై సందర్శకుల సౌకర్యార్థం హోటల్‌ నిర్మించాలని సూచించారు. పర్యాటకుల వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.