హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధ్యులపై కఠిన చర్యలు: ఎమ్మెల్యే

RR: అంజయ్యనగర్‌లో నాలాను ఆనుకుని అక్రమంగా నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఎమ్మెల్యే గాంధీ, హైడ్రా, సీఎంసీ ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను వేగవంతం చేశారు. బిల్డర్ల అత్యాశ వల్లే ప్రమాదం జరిగిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.