హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారి విగ్రహం ధ్వంసం

MBNR: నర్వ మండలం పరిధిలోని పాతర్చెడ్ గ్రామంలో చెరువు కట్టపై వెలసిన జమలమ్మ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు. జమలమ్మ దేవాలయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.