ASR: డుంబ్రిగూడ మండలంలోని కండ్రుం పంచాయతీ ఉజ్జంగి గ్రామంలో అంగన్వాడీ భవనం నిర్మించి, ప్రస్తుతం ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాన్ని మెయిన్ అంగన్వాడీ కేంద్రంగా మార్చాలని ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి తామర్ల సూర్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి సురేష్‌కుమార్ డిమాండ్ చేశారు. సొంత భవనం లేకపోవడంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఉజ్జంగిలో అంగన్వాడీ భవనం నిర్మించాలి'


