హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండాల ఏకలవ్య స్కూల్‌ను సందర్శించిన పీవో

BDK: గుండాల ఈఎంఆర్ఎస్ పాఠశాలను ఐటీడీఏ పీవో బి.రాహుల్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల పాఠశాలో జరిగిన ఆందోళనలపై విద్యార్థులు, ఉపాధ్యాయులతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. వర్గ విభేదాలు వీడి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటూ స్పష్టమైన లక్ష్యాలతో ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.