హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుస్నాబాద్‌లో జాతీయ లోక్‌ అదాలత్

SDPT: హుస్నాబాద్ కోర్టులో సెప్టెంబర్ 12న జాతీయ లోక్‌ అదాలత్ నిర్వహించనున్నట్లు అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఈ. ప్రమిద తెలిపారు. లోక్‌ అదాలత్ ద్వారా కేసులను త్వరగా, ఎలాంటి ఖర్చు లేకుండా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.