హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట ఆడుతూ ఐదుగురు పట్టివేత.. బైండోవర్

MNCL: జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సేవాదాస్‌నగర్‌లోని చర్చి సమీపంలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఐదుగురు వ్యక్తులను శనివారం సాయంత్రం స్థానిక తహసీల్దార్ బక్కయ్య ఎదుట హాజరు పరిచినట్లు స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ తెలిపారు. తహసీల్దార్ ఆ నిందితులచే బాండుపై రూ.ఒక లక్ష చొప్పున అగ్రిమెంట్ రాయించి, సొంత పూచికత్ పై వదిలివేసినట్లు ఆయన విలేకరులకు తెలిపారు.