హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ కళాశాలలో DIEO ఆకస్మిక తనిఖీ

GDWL: మానోపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో DIEO ఎం.హృదయ రాజు శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తరగతి గదులు, విద్యార్థుల హాజరు, బోధనా తీరును పరిశీలించారు. కస్తూర్బా గాంధీ ఇంటర్మీడియట్ కళాశాలను కూడా తనిఖీ చేశారు. అడ్మిషన్లు పెంచేందుకు పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థుల వివరాలు సేకరించి, ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత విద్య, వసతులపై అవగాహన కల్పించాలని సూచించారు.