హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి'

HNK: గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయడానికి కార్యకర్తలు సిద్ధం కావాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.చుక్కయ్య పిలుపునిచ్చారు. కాజీపేట మండల కేంద్రంలో శనివారం మండల స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. జంపాల రమేష్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఓరుగంటి సాంబయ్య, కళా పాల్గొన్నారు.