హైదరాబాద్: 28°C
తెలంగాణ

SSC మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

MLG: మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన SSC మిత్రుడు కట్ల గణపతి తండ్రి కట్ల సూరయ్య మృతిచెందడంతో శనివారం పదో తరగతి మిత్రులు కుటుంబాన్ని పరామర్శించారు. మిత్రుల ఆధ్వర్యంలో సమకూర్చిన రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని అందించి, ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బైకాని మహేందర్ యాదవ్, జెట్టి విజయ్‌కుమార్, మొర్రి రాజుయాదవ్ తదితరులు ఉన్నారు.