హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన

ములుగు జిల్లా తాడ్వాయి ఐసీడీఎస్ పరిధిలో గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. టీచర్ పోస్టులకు ఆగస్టు 25, 27న, హెల్పర్ పోస్టులకు సెప్టెంబర్ 2, 3న ఉదయం 10.30 గంటలకు సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయాల్లో హాజరుకావాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.