KMR: మద్నూర్ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా షేక్ హసీనా (తడిహిప్పర్గా) నియమితులైనట్లు ఏపీఎం జగదీష్ తెలిపారు. కార్యదర్శులుగా పాంచాళ్ ప్రేమ (మద్నూర్), అనిషాబేగం (రుసేగావ్) ఎన్నికైనట్లు పేర్కొన్నారు. నూతన కమిటీ సభ్యులను ఏపీఎం ఆధ్వర్యంలో శనివారం సన్మానించారు. మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.
తెలంగాణ
మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా షేక్ హసీనా


