హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సుధాకర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం'

VZM: సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రజా ఉద్యమాల నేత కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతిని విజయనగరం సీపీఐ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు అత్తిలి విమల ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులు, యువత, రైతులు, కార్మికులు, పేదల హక్కుల కోసం ఆయన జీవితాంతం పోరాడారని కొనియాడారు.