హైదరాబాద్: 28°C
వ్యాపారం

యాపిల్‌లో 200 మంది ఉద్యోగులకు లేఆఫ్స్

టెక్ దిగ్గజం యాపిల్ లేఆఫ్స్‌కు సిద్ధమైంది. తన పాపులర్ డిజిటల్ అసిస్టెంట్ 'సిరి'తో పాటు 'విజన్ ప్రో' హెడ్‌సెట్ విభాగాలలో పనిచేస్తున్న 200 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. AI, కొత్త ఉత్పత్తుల అభివృద్ధిపై దృష్టి పెట్టే క్రమంలో ఈ నిర్ణయం తీసుకోంది. విజన్ ప్రోకు మార్కెట్లో అనుకున్న రెస్పాన్స్ రాకపోవడంతో ఆ టీమ్‌ సభ్యులను తగ్గించుకోవాలని చూస్తోంది.