హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో డ్రగ్స్, గంజాయి అరికట్టాలి: యూఎస్‌ఎఫ్‌ఐ

MDK: జిల్లాలో డ్రగ్స్,గంజాయి,ఆన్‌లైన్ బెట్టింగ్‌ను అరికట్టాలని యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జగన్ కోరారు. మెదక్ ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అజయ్ పాల్గొన్నారు.