హైదరాబాద్: 28°C
తెలంగాణ

బడిలో ఎంపీడీవో తనిఖీలు

MDK: చిన్నశంకరంపేట మండలం జంగారాయితండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను శనివారం ఎంపీడీవో దామోదర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణను శుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు పరిశుభ్రత అలవాటు చేయాలని సూచించారు.