హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోనస్ కోసం పేర్లు నమోదు చేసుకోవాలి: DAO

NRPT: ప్రభుత్వం సూచించిన సన్నరకం వరి పండిస్తున్న రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణంలో పేర్లు నమోదు చేసుకోవాలని నారాయణపేట జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్ శనివారం తెలిపారు. ఏడు రకాల సన్నరకాల వరికే ప్రభుత్వం బోనస్ చెల్లిస్తుందని చెప్పారు. సొంత విత్తనాలు నాటిన రైతులు వ్యవసాయ విస్తీర్ణ అధికారికి ధ్రువీకరణ పత్రం అందించాలని సూచించారు.