హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొక్కలను నాటిన ఎక్సైజ్‌ అధికారులు

KMR: వనమహోత్సవంలో భాగంగా ఎక్సైజ్ అధికారులు శనివారం మద్నూర్ మండల పరిధిలోని పెద్ద ఎక్లారా గ్రామశివారు ప్రాంతంలో 200 ఈత చెట్ల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై నాగేష్ మాట్లాడుతూ.. నాటిన ఈత చెట్ల మొక్కలను సంరక్షించుకునే బాధ్యత గౌడ సోదరులనే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్స్‌, ఆ గ్రామ గౌడ సంఘం సభ్యులు, పాల్గొన్నారు.