హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలి: SP

NRPT: ప్రజలకు పారదర్శక, జవాబుదారితనంతో కూడిన సేవలు అందించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. శనివారం నారాయణపేట మండలం అప్పక్‌పల్లిలోని రూరల్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. సిబ్బంది పరేడ్‌ను పరిశీలించి, స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటాలని ఎస్సై సతీష్‌రెడ్డికి సూచించారు. సిబ్బంది వివరాలు తెలుసుకుని, పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.