హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీవో రద్దుకు అసెంబ్లీలో పోరాడతా: ఎమ్మెల్యే

RR: సిద్దాపూర్‌లో చెత్త తరలింపు కేంద్రం ఏర్పాటుకు 86 ఎకరాల భూమిని బదలాయిస్తూ జారీ చేసిన జీవో 641ను రద్దు చేయాలని పోరాట సమితి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కోరింది. చెత్త కేంద్రంతో ప్రజారోగ్యం, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో రద్దు కోసం శాసనసభలో పోరాడుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.