MDK: అల్లాదుర్గ్ మండలం సర్పంచ్ ముక్కెర శశిధర్‌రెడ్డి అధ్యక్షతన చిల్వర్ గ్రామంలో న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు జరిగింది. జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఏ. సుచరిత ముఖ్య అతిథిగా హాజరై తీర్పుల ప్రాంతీయ అనువాదం, వయోవృద్ధుల, ఆదివాసీల దినోత్సవాలు, వ్యవసాయ చట్టాలు, రైతు పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సదస్సులో పలువురు అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రామంలో చట్టాలపై అవగాహన సదస్సు


