JGL: మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ శనివారం తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల లభ్యతపై ఆరా తీశారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. అన్ని వైద్య పరీక్షలు ఆసుపత్రిలోనే నిర్వహించాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న నూతన భవనాన్ని పరిశీలించి పనులు పూర్తి చేయాలన్నారు.
తెలంగాణ
మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే సంజయ్ తనిఖీ


