హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాము కాటుతో చిన్నారి మృతి

NRPT: దామరగిద్ద మండలంలోని మల్రెడ్డిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న 18 నెలల శివ కార్తికేయను శుక్రవారం అర్ధరాత్రి పాము కాటేసింది. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏకైక కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.