హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సెన్సస్ హ్యాండ్‌బుక్‌కు శాఖల వివరాలు సమర్పించాలి'

NRML: సెన్సెస్ హ్యాండ్‌బుక్ తయారీకి శాఖలవారీగా పూర్తి, కచ్చితమైన వివరాలను నిర్దేశిత గడువులోగా సమర్పించాలని జిల్లా అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం హ్యాండ్‌బుక్ రూపకల్పనపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రామాణిక నమూనా ప్రకారం సమాచారం సేకరించి, గణాంకాల్లో తప్పులు లేకుండా చూడాలని సూచించారు.