హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెళ్లకూరు ఆస్పత్రిలో అధికారిణి తనిఖీ

TPT: జిల్లాలోని పెళ్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శాంతికుమారి శనివారం సందర్శించారు. పీహెచ్‌సీలోని మందుల గది, వార్డు, ల్యాబ్‌లను పరిశీలించి రిజిస్టర్లను తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ సుజాత, సీహెచ్‌ఓ శివారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.